ఆఫ్రికా దేశం సుడాన్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల పారామిలటరీ ఆర్ఎస్ఎఫ్ జరిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య 300 దాటినట్లు యూఎన్ హ్యుమానిటీ ఏజెన్సీ వెల్లడించింది. వీరిలో 10 మంది ఐరాస సిబ్బంది కూడా ఉన్నట్లు పేర్కొంది. మృతుల్లో 23 మంది చిన్నారులు ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ఆ దేశంలో దాదాపు రెండేళ్లుగా పౌర యుద్ధం కొనసాగుతోంది.