మసాజ్ తో శిశువుల సంపూర్ణ ఆరోగ్యం

4003చూసినవారు
మసాజ్ తో శిశువుల సంపూర్ణ ఆరోగ్యం
మసాజ్ వల్ల శిశువులకు రక్త ప్రసరణ మెరుగుపడి, కండరాలు, ఎముకలు దృఢంగా మారతాయని నిపుణులు అంటున్నారు. నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో బరువు పెరగడం వేగవంతమవుతుంది. పొత్తికడుపు మసాజ్ గ్యాస్, మలబద్ధకం, కడుపు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. శిశువులను రిలాక్స్ చేసి, మెదడు ఎదుగుదలకు మేలు చేస్తుంది.  బొడ్డు ఆరిపోయిన 1-2 వారాల తర్వాత మసాజ్ ప్రారంభించాలి. కొబ్బరి, బాదం నూనె వంటి సహజ నూనెలు వాడాలి. పాలు తాగిన 45 నిమిషాల తర్వాతనే, సున్నితంగా మసాజ్ చేయాలి.

సంబంధిత పోస్ట్