పీసీబీలో భారీగా అవినీతి: పాక్ మాజీ క్రికెట‌ర్‌

13466చూసినవారు
పీసీబీలో భారీగా అవినీతి: పాక్ మాజీ క్రికెట‌ర్‌
పీసీబీలో భారీగా అవినీతి జ‌రుగుతోంద‌ని పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్ అతిక్ ఉజ్ జ‌మాన్ ఆరోపించాడు. క్రికెట‌ర్ల‌కు నాసిర‌కం కిట్లు ఇస్తోంద‌న్నాడు. దీనికి బుధ‌వారం యూఏఈతో జ‌రిగిన మ్యాచ్ సాక్ష్య‌మ‌న్నాడు. ఇతర జట్లు సరైన డ్రై ఫిట్‌ కిట్స్‌తో ఆసియా కప్‌లో బరిలోకి దిగుతుంటే.. పాకిస్థాన్‌ ఆటగాళ్ల జెర్సీలు మాత్రం చెమటతో తడిసి ముద్దవుతున్నాయన్నాడు. టెండర్లు ప్రొఫెషనల్స్‌కు కాకుండా ఫ్రెండ్స్‌కు అప్పగిస్తే ఫలితం ఇలాగే ఉంటుంద‌న్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్