మెక్సికో దక్షిణ రాష్ట్రం చియాపాస్ తీరంలో శుక్రవారం 7.3 తీవ్రతతో భారీ
భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం భూమికి 15.2 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు
అమెరికా భూగర్భ సర్వే (USGS) వెల్లడించింది. భూకంప ప్రభావంతో మెక్సికోతో పాటు గ్వాటెమాలా, ఎల్ సాల్వడార్ దేశాల్లో భవనాలు ఊగిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ఇప్పటివరకు ప్రాణ, ఆస్తి నష్టంపై అధికారిక సమాచారం వెలువడలేదు.