మెక్సికోలో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. న్యూ ఇయర్ తర్వాత తొలి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రెసిడెంట్ క్లాడియా మాట్లాడుతుండగా భవనం షేక్ అయింది. దీంతో ఆమె తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపి అందరితో కలిసి బయటికి వెళ్లిపోయారు. సెంట్రల్ మెక్సికోలో భూకంపం తీవ్రతతో భవనాలన్నీ ఊగిపోయాయి. ప్రాణ, ఆస్తి నష్టంపై సమాచారం తెలియాల్సి ఉంది.