ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో బుధవారం భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. అన్నారం - మడికల్ అడవుల ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌తో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మావోయిస్టుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.