TG: హైదరాబాద్ జలవిహార్‌లోని RO ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ప్లాంట్‌లో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి యంత్రాలు, ఫిల్టర్ పరికరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. హై ప్రెషర్ ఏర్పడటమే పేలుడుకు కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.