పాకిస్థాన్‌లోని క్వెట్టాలో మంగళవారం ఉదయం 11 గంటల తరువాత భారీ పేలుడు సంభవించింది. పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ముందు ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పలు కార్లు, మిగతా వాహనాలు ధ్వంసం అయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.