మీర్‌పేట్ ఫుడ్ కోర్టులో భారీ అగ్నిప్రమాదం.. చెలరేగిన మంటలు

13చూసినవారు
హైదరాబాద్‌లోని మీర్‌పేట్ లెనిన్ నగర్‌లో ఉన్న ఒక ఫుడ్ కోర్టులో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం ఎలా సంభవించిందనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్