రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని బాలాజీ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మెర్సిడెస్ వర్క్‌షాప్‌లో చెలరేగిన మంటల్లో సుమారు 8 లగ్జరీ కార్లు, ఖరీదైన విడిభాగాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 10 ఫైరింజన్లతో సుమారు రెండు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. వర్క్‌షాప్‌లోని 50కి పైగా కార్లలో మిగిలిన వాటిని సురక్షితంగా బయటకు తరలించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.