TG: హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్వరి టెంపుల్ సమీపంలో ఉన్న 'ఫర్నిచర్ హోమ్స్' షాపులో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో సుమారు రూ.70 లక్షల విలువైన ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. మంటల ధాటికి పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ ఏసీ అవుట్ డోర్ యూనిట్లు కూడా కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.