బాచుపల్లిలో ఘోర అగ్నిప్రమాదం(వీడియో)

0చూసినవారు
హైదరాబాద్ – బాచుపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని ప్రగతినగర్ ప్రాంతంలో ఉన్న ఫర్నిచర్ షాపుల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక షాపులో సిలిండర్ పేలి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. వరుసగా షాపులు ఉండటంతో పక్క షాపుల్లోని ఫర్నిచర్‌కు కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగ కమ్మేసింది. ఈ ఘటనతో ప్రాణభయంతో స్థానికులు అక్కడినుండి పరుగులు తీశారు. సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్