రెడ్ హిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం (వీడియో)

2చూసినవారు
TG: హైదరాబాద్‌ రెడ్ హిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మొహమ్మది భౌరా మసీదుకు ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్