షాపింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం.. 8 మంది మృతి (వీడియో)

31చూసినవారు
ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలోని అండిషే పట్టణంలో అర్ఘవాన్ షాపింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 36 మంది గాయపడ్డారు. మంటలు ఎలా చెలరేగాయో ఇంకా తెలియరాలేదని, అధికారులు దర్యాప్తు చేస్తున్నారని ప్రభుత్వం తెలిపింది. అమెరికాతో కొనసాగుతున్న కాల్పుల విరమణకు, ఈ ప్రమాదానికి ఎలాంటి సంబంధం లేదని ప్రాథమికంగా తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు.