నెస్లేలో భారీ లేఆఫ్‌లు.. 16వేల ఉద్యోగాల కోత

1చూసినవారు
నెస్లేలో భారీ లేఆఫ్‌లు.. 16వేల ఉద్యోగాల కోత
ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాకేజ్డ్‌ ఫుడ్ కంపెనీ నెస్లే, రానున్న రెండేళ్లలో 16వేల మంది ఉద్యోగులను తొలగించనుంది. సీఈఓ ఫిలిప్ నవ్రాటిల్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా సంస్థ మారాలని, ఇది కఠిన నిర్ణయమైనా తప్పదని ఆయన తెలిపారు. ఇప్పటికే 4వేల మంది ఉత్పత్తి, సరఫరా విభాగాల్లో తొలగింపు ప్రక్రియ కొనసాగుతుండగా, మరో 12వేల మంది వైట్‌కాలర్ సిబ్బంది కూడా ఈ లేఆఫ్‌లో భాగం కానున్నారు.