
ప్రభుత్వ ఉద్యోగిని కొట్టి చెరువులో పడేశారు (వీడియో)
యూపీలోని లక్నో సమీపంలో ఆదివారం దారుణం జరిగింది. మదియాన్వ్లోని సదర్ తహసీల్ ప్రాంతంలో సర్వే నిర్వహించడానికి ప్రభుత్వ ఉద్యోగుల బృందం వెళ్లగా గ్రామస్తులు దాడి చేశారు. అధికారుల వద్ద ఉన్న పత్రాలను చింపేశారు. తమను చెరువులో ముంచి చంపేందుకు యత్నించారని ప్రభుత్వ ఉద్యోగులు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.




