గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో భారీగా అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ల (ఏఎంసీ) బదిలీలు జరిగాయి. మొత్తం 140 మంది ఏఎంసీలను పాత, కొత్త సర్కిళ్లకు నియమిస్తూ కమిషనర్ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. రెవిన్యూ విభాగంలోని ఈ అధికారుల బదిలీలు కార్పొరేషన్ కార్యకలాపాల్లో కీలక మార్పులకు దారితీయనున్నాయి.