TG: రాష్ట్రంలో భారీగా డీఎస్పీల బదిలీలు జరిగాయి. తెలంగాణ వ్యాప్తంగా 36 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. డీజీపీ సీవీ ఆనంద్ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. గత కొంతకాలంగా పోస్టింగ్స్ కోసం వెయిటింగ్‍లో ఉన్న 28 మంది సివిల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారులను బదిలీ చేశారు. వెంటనే అమల్లోకి వచ్చేలా ఖాళీగా ఉన్న స్థానాల్లో వీరికి కొత్త పోస్టింగులు కేటాయించారు.