"ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్స్ అకౌంటెంట్స్ ఆఫ్
ఇండియా" ఆగస్టు 5, 2026న ప్రకటించిన సి.ఎం.ఏ ఫైనల్, సి.ఎం.ఏ ఇంటర్ ఫలితాల్లో ప్రముఖ విద్యాసంస్థ మాస్టర్‌మైండ్స్
విద్యార్థులు దేశవ్యాప్తంగా విశేష ప్రతిభ కనబరిచారు. సి.ఎం.ఏ ఫైనల్‌లో ఆలిండియా తొలి 10 ర్యాంకుల్లో 1వ, 3వ, 7వ ర్యాంకులను మాస్టర్‌మైండ్స్
విద్యార్థులు కైవసం చేసుకోగా, తొలి 50 ర్యాంకుల్లో మొత్తం 26 మంది చోటు దక్కించుకున్నారని సంస్థ అడ్మిన్ అడ్వైజర్ సి.ఏ మట్టుపల్లి మోహన్ తెలిపారు. అలాగే సి.ఎం.ఏ ఇంటర్‌లో ఆలిండియా 4వ, 8వ, 9వ ర్యాంకులతో పాటు తొలి 50 ర్యాంకుల్లో 25 మంది
విద్యార్థులు నిలిచారని వెల్లడించారు. ఈ ఫలితాలతో ఫైనల్, ఇంటర్ విభాగాలు కలిపి ఆలిండియా టాప్-10లో మొత్తం 6 ర్యాంకులు, టాప్-50లో మొత్తం 51 ర్యాంకులు మాస్టర్‌మైండ్స్
విద్యార్థులు సాధించడం విశేషం. సి.ఎం.ఏ ఫైనల్‌లో ఆలిండియా ప్రథమ ర్యాంకు సాధించిన మట్టుపల్లి మోక్షిత్ వంశీ కృష్ణను సి.ఎ. మట్టుపల్లి మోహన్ అభినందించి సత్కరించారు. ఒకే మార్కులు సాధించిన అభ్యర్థులకు ఒకే ర్యాంకు కేటాయించే విధానం కారణంగానే టాప్-50లో మొత్తం 51 ర్యాంకులు నమోదయ్యాయని ఆయన స్పష్టం చేశారు. ఈ అద్భుత
ఫలితాలు మాస్టర్‌మైండ్స్ అందిస్తున్న నాణ్యమైన శిక్షణకు మరోసారి నిదర్శనంగా నిలిచాయి.