యూపీ టీ20 లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేపింది. కాశీ రుద్రాస్ ఫ్రాంచైజీ యజమాని అర్జున్ చౌహన్‌కు ఓ బుకీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మెసేజ్ పంపి, జట్టులో ఆటగాడు చెప్పినట్టు ఆడితే రూ.1 కోటి ఇస్తానని ఆఫర్ చేశాడు. ఈ విషయాన్ని అర్జున్ పోలీసులకు తెలపడంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.