TG: ఆదిలాబాద్‌లో సోమవారం జరిగిన జాగృతి జనం బాట కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్, బీజేపీలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. చెనాక-కోర్ట ప్రాజెక్టు పనులపై బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో 90 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన 10 శాతం పనులకు రూ. 179 కోట్లు ఖర్చు చేస్తే 50 వేల ఎకరాలకు నీరందుతుందని తెలిపారు.