
మ్యాచ్ సమయంలో విరాట్ వద్దకు దూసుకువచ్చిన కాళ్లపై పడ్డ అభిమాని (వీడియో)
భారత్-దక్షిణాఫ్రికా రెండో వన్డేలో విరాట్ కోహ్లీ 90 బంతుల్లో 53వ సెంచరీ సాధించాడు. అయితే, రాయ్పూర్ మ్యాచ్లో భద్రతా లోపం కలకలం రేపింది. డ్రింక్స్ బ్రేక్ సమయంలో ఓ అభిమాని పిచ్ వద్దకు వచ్చి కోహ్లీ కాళ్ళను మొక్కాడు. రాంచీ వన్డేలోనూ ఇలాంటి సంఘటన జరిగింది. భద్రతా వైఫల్యంపై కొందరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయగా, మరికొందరు ఆ అభిమానిని అదృష్టవంతుడిగా అభివర్ణించారు.




