మే డే.. పలు భాషల్లో ఎలా పిలుస్తారంటే?

18చూసినవారు
మే డే.. పలు భాషల్లో ఎలా పిలుస్తారంటే?
మే 1న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని (మే డే) వివిధ పేర్లతో జరుపుకుంటారు. ఈ రోజు కార్మికుల హక్కులు, వారి పోరాటాలను గుర్తుచేసుకునేందుకు అంకితం చేయబడింది. తెలుగు, హిందీలో మే డే, కార్మిక దినం అని, మరాఠీలో కామ్‌గర్ దివస్, తమిళంలో ఉజైపాలర్ నాళ్ అని పిలుస్తారు. గ్రీస్‌లో ప్రోటోమాగియా, చెక్‌లో లాస్కీ కాస్ (ప్రేమికుల దినం), ఇటలీలో కాలెండిమాగియో లేదా కాంతర్ మాగియో అని అంటారు. ఇంగ్లీష్‌లో ఇంటర్నేషనల్ వర్కర్స్ డే, మే డే, లేబర్ డే అని వ్యవహరిస్తారు. భారతదేశంలో మే 1ను మహారాష్ట్ర, గుజరాత్ దినోత్సవంగా కూడా జరుపుకుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్