కార్మిక దినోత్సవం (మే డే) ఆవిర్భావం షికాగోలోని హే మార్కెట్ ఘటనతో ముడిపడి ఉంది. 1886లో జరిగిన ఈ ప్రదర్శనలో పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు కార్మికులు మరణించారు. దీనికి గుర్తుగా 1889-90 నుంచి మే 1న కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలనే ఒప్పందం కుదిరింది. భారతదేశంలో 1923 మే 1న మద్రాసులో లేబర్ కిసాన్ పార్టీ ఆధ్వర్యంలో తొలిసారి ఈ వేడుకలు జరిగాయి. ఈ రోజున అనేక దేశాల్లో కార్మికుల సంక్షేమ పథకాలు ప్రారంభమయ్యాయి, అలాగే నిరసన ప్రదర్శనలకు వేదికగా మారింది.