పాతబస్తీలో యువకుడిపై 'మాయా గ్యాంగ్' దాడి (వీడియో)

0చూసినవారు
TG: హైదరాబాద్ పాతబస్తీలో 'మాయా గ్యాంగ్' అరాచకాలు పెరిగిపోతున్నాయి. సంతోష్‌నగర్ పరిధిలోని జవహర్ కాలనీలో బాసిత్ అనే యువకుడిపై సోహైల్, సౌద్ అనే సభ్యులు విచక్షణారహితంగా దాడి చేశారు. అకారణంగా దాడి చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.  గతంలోనూ ఈ గ్యాంగ్‌పై అనేక కేసులున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్