రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వ్యవసాయ భూమికి ఆధార్ మాదిరిగా ప్రత్యేక ఐడీ నంబర్‌తో కూడిన 'భూధార్' కార్డులను జారీ చేయనుంది. ఈ సంస్కరణ భూములకు చట్టబద్ధమైన గుర్తింపును, భూ లావాదేవీలలో పారదర్శకతను పెంచుతుంది. యాజమాన్య హక్కుల ఆధారంగా రైతులకు కార్డులు అందిస్తారు. రెవెన్యూ శాఖ 'mభూధార్' యాప్‌ను ప్రారంభించింది. స్థానిక ఎన్నికల అనంతరం 2026 జనవరి నుంచి భూధార్ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుంది.