దేశీయంగా మెక్‌డొనాల్డ్స్ ఫాస్ట్-ఫుడ్ చైన్‌ను నిర్వహిస్తున్న వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్, తమ యాప్ ద్వారా కేవలం 20 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ అందించే నూతన మోడల్‌ను ప్రారంభించనుంది. ఈ సేవలతో రాబోయే రెండేళ్లలో అమ్మకాలను 3-5 శాతం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ సీఈఓ అక్షయ్ జాటియా తెలిపారు. 20 నిమిషాల డెలివరీ ద్వారా వ్యాపారం పటిష్టపడి, థర్డ్ పార్టీలపై ఆధారపడటం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.