
ఎన్కౌంటర్.. హిడ్మా భార్య రాజే అలియాస్ రాజక్క మృతి
AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా, అతని భార్య రాజే అలియాస్ రాజక్కతో సహా ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. డివిజన్ కమిటీ సభ్యురాలైన రాజేపై రూ.50 లక్షల రివార్డు ఉంది. మరణించిన వారిలో స్టేట్ జోనల్ కమిటీ సభ్యుడు చెల్లూరి నారాయణ అలియాస్ సురేశ్, టెక్ శంకర్, మల్లా, దేవే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు.




