రూ.2 వేలు దాటిన మర్చంట్ UPI లావాదేవీలపై విధించే 0.4% MDR ఛార్జీని కస్టమర్లు కాకుండా వ్యాపారులే భరించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. MDR తప్పించుకునేందుకు కొందరు రూ.6 వేల బిల్లును రూ.2 వేల చొప్పున మూడుసార్లు చెల్లిస్తున్నారు. ఇలా చేయడం వల్ల బ్యాంకుల ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్ అప్రమత్తమై, అనుమానాస్పద లావాదేవీగా గుర్తించి UPI సేవలను తాత్కాలికంగా బ్లాక్ చేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. MDR ఛార్జీలు వ్యాపారులు మాత్రమే భరించాలి, కస్టమర్ల నుంచి వసూలు చేయడం చట్టవిరుద్ధం.