TG: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టుల వద్ద అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి R&B అధికారులను ఆదేశించారు. సెలవులు లేకుండా క్షేత్ర స్థాయిలో ఉండి, ప్రజా రవాణాకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. రెవెన్యూ, పోలీసు, విద్యుత్, నీటిపారుదల శాఖలతో సమన్వయం చేసుకుంటూ, అవసరమైతే తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, రాష్ట్ర వ్యాప్తంగా పర్యవేక్షించాలని, డివిజన్ల వారీగా వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు.