TG: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న గ్రేటర్ హైదరాబాద్‌లో మాంసం, వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఈ మేరకు గొర్రెలు, మేకలు, పశువుల వధశాలలు, మాంసం దుకాణాలను మూసివేయాలని GHMC ఆదేశాలు జారీ చేసింది. స్టాండింగ్ కమిటీ తీర్మానం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ ఉత్తర్వుల అమలులో ఉన్నందున మున్సిపల్ అధికారులకు సహకరించాలని కోరింది. కాగా OCT 2న రాష్ట్రవ్యాప్తంగా కూడా మాంసం, వైన్ షాపులు బంద్ అయ్యే అవకాశం ఉంది.