హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలంలోని పెద్ద తండాకు చెందిన రైతు గుగులోతు వీరన్న, తన రెండు ఎకరాల మొక్కజొన్న పంటను కోతులు, అడవి పందులు, ఉడుతలు, కోళ్లు, మేకల వంటి మూగజీవాల బెడద నుంచి కాపాడుకునేందుకు వినూత్నంగా పంట చుట్టూ వల ఏర్పాటు చేశారు. గ్రామానికి సమీపంలో పొలాలు ఉండటంతో జంతువుల సంచారం ఎక్కువగా ఉంటుందని, ఈ వల ద్వారా పంటను సురక్షితంగా ఉంచుకోవచ్చని ఆయన తెలిపారు. రైతు తీసుకున్న ఈ చర్య ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తోంది.