తూప్రాన్ మండలం, నర్సంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రెడ్యా నాయక్ తండాలో విషాదం నెలకొంది. తండాకు చెందిన సాయి (24) రామాయంపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్నేహితులతో కలిసి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తండావాసులు తెలిపారు. సమీప ఆసుపత్రికి తరలించగా, మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. యువకుడి ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు, తండా ప్రజలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.