చేగుంట మండలం పొలంపల్లి టర్నింగ్ వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాగర్ కుమార్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు సమాచారం అందించడంతో 108 సిబ్బంది అతన్ని తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరిగిన టర్నింగ్ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.