వెల్దుర్తి పీహెచ్‌సీలో ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న రజనీ, వైద్యుల వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. మాసాయిపేట ఆరోగ్య ఉపకేంద్రంలో ఏఎన్‌ఎంలు లేరని, అక్కడికి వెళ్లాలని వైద్యురాలు శిరీష ఆదేశించినా, తాను వెళ్లనని రజనీ స్పష్టం చేశారు. దీనితో వైద్యులు శిరీష, సౌజన్యలు తనను వేధిస్తున్నారని, చనిపోతానని చెప్పి గదిలోకి వెళ్లి మధుమేహం మందులు మింగారు. సిబ్బంది గమనించి వెంటనే మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతున్నారు. వైద్యులు మాత్రం వేధింపులు లేవని, విధులకు సంబంధించి సూచనలు మాత్రమే చేశామని తెలిపారు.