వై జంక్షన్‌లో మరో ప్రమాదం.. లారీ ఢీకొట్టడంతో కారు ధ్వంసం

0చూసినవారు
రామాయంపేట పరిధిలోని 44వ జాతీయ రహదారిపై వై జంక్షన్ వద్ద కామారెడ్డి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో దాని ముందు చక్రాలు ఊడిపోయాయి. ఈ ఘటనతో జాతీయ రహదారిపై కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్