విగ్రహ శుద్ధి చేసి ఆర్యవైశ్యుల నిరసన, అనంతరం ధర్నా

0చూసినవారు
పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు అవమానించారు. విగ్రహంపై పేడ పూయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ఆర్యవైశ్యులు విగ్రహాన్ని శుద్ధి చేసి నివాళులర్పించి, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్