అప్పుతో కొనుకున్న ఆటో ధ్వంసం

2చూసినవారు
కార్నర్పల్లి గ్రామంలో అకాల వర్షం, ఈదురు గాలుల కారణంగా భారీ నష్టం సంభవించింది. గాలి ఉధృతికి ఒక ఇంటి గోడ కూలి, సాయికుమార్ అనే వ్యక్తికి చెందిన ఆటో, బైక్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. అప్పు చేసి కొనుగోలు చేసిన ఆటో పోవడంతో అతని జీవనాధారం దెబ్బతింది. మూడు ఎకరాల్లో సాగు చేసిన వరి పంట కూడా నేలకొరిగిందని, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయానని బాధితుడు తెలిపారు. ప్రభుత్వం తక్షణం స్పందించి ఆర్థిక సహాయం అందించాలని అతను వేడుకుంటున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్