పౌష్టికాహార లోపాన్ని నివారించి ఆరోగ్యంగా ఉండాలంటే నిత్య ఆహారంలో పోషక విలువలున్న పదార్థాలను తప్పనిసరిగా చేర్చుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ లక్ష్మి సూచించారు. జాతీయ పోషణ మాసోత్సవంలో భాగంగా నిజాంపేట మండల కేంద్రంలోని పీఎం శ్రీ హైస్కూల్లో శనివారం అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పోషణపై ప్రతిజ్ఞ చేయించారు. కిశోర బాలికలకు పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రత ప్రాధాన్యాన్ని వివరించారు. ఆకుకూరలు, పప్పులు, కూరగాయలు, పండ్లు తదితర పదార్థాలతో
విద్యార్థులు వివిధ రకాల పౌష్టిక వంటకాలను తయారు చేసి ప్రదర్శించారు. సమతుల్య ఆహారం తీసుకోవడంతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.