జిల్లా కలెక్టరేట్‌లో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ ఉత్సవానికి హాజరయ్యారు. మహిళలు పూలతో అలంకరించిన బతుకమ్మలను గౌరీమాతకు పూజలు చేస్తూ లయబద్ధంగా చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ఎంతో ఉత్సాహంగా ఆటపాటల్లో పాల్గొన్నారు. బతుకమ్మ, బోనాలు పండుగల ఔన్నత్యాన్ని భావితరాలకు తెలియజేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.