మెదక్ జిల్లా కౌడిపల్లిలో బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెను
కాంగ్రెస్ నాయకులు అర్ధరాత్రి కూల్చివేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఆవిర్భావ దినోత్సవం కోసం అలంకరించిన జెండా గద్దెను ఓర్వలేక ఈ దురాగతానికి పాల్పడ్డారని వారు తెలిపారు. ఈ ఘటనపై కౌడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి,
కాంగ్రెస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి, మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.