
విద్యుత్ కొనుగోలు చార్జీలు తగ్గించేలా ప్రణాళికలు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. విద్యుత్ కొనుగోలు చార్జీలను యూనిట్‌కు రూ.4.60కు తగ్గించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంచడం, ఇంధన రంగంలో పరిశోధన కోసం ప్రత్యేక ఎనర్జీ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈవీ వాహనాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, పథకాల అమలుకు సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. ఈ ఏడాది విద్యుత్ వినియోగం 14% పెరిగిందని చంద్రబాబు తెలిపారు.




