జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున గౌడ్, పట్టణ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లికార్జున గౌడ్ మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధనకు కీలక పాత్ర పోషించిందని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత సంక్షేమం, అభివృద్ధిలోనూ ప్రభుత్వం ముందంజలో ఉందని పేర్కొన్నారు.