వర్గల్ మండలం నాచారం శివారులో గురువారం కల్పన (26) అనే యువతి దారుణ హత్యకు గురైంది. చేగుంట మండలం కన్యారం గ్రామానికి చెందిన కల్పన, భర్తతో గొడవల కారణంగా పుట్టింట్లో ఉంటోంది. నాచారం శివారులో ఆమె మృతదేహం లభ్యమవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.