నగదు రూ. 31, 433 స్వాధీనం: జూదం కేసులో ఆరుగురు అరెస్ట్

0చూసినవారు
నగదు రూ. 31, 433 స్వాధీనం: జూదం కేసులో ఆరుగురు అరెస్ట్
పాపన్నపేట మండలం కోత్తపల్లి శివారులో అక్రమంగా బొమ్మ బొడుసు జూదం ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 31,433 నగదు, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి, జూదం ఆడుతున్నట్టు గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్