కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మెదక్ డివిజన్ ఆఫీసు పరిధిలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నర్సింగ్ మాట్లాడుతూ చికాగోలో 1886 పారిశ్రామికవేత్తలకు వ్యతిరేకంగా కార్మికులు తిరుగుబాటు చేయడం జరిగింది. 16 గంటల పని భారాన్ని ఎనిమిది గంటలకు కుదించాలని పెద్ద ఎత్తున కార్మికులు తిరుగుబాటు చేయడం జరిగింది అన్నారు.