బాల సాహిత్యం అవసరం: ఏసిజిఇ ఆడేపు కరుణాకర్

0చూసినవారు
బాల సాహిత్యం అవసరం: ఏసిజిఇ ఆడేపు కరుణాకర్
నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి, వారి కోసం బాల సాహిత్య రచనలు ఎంతో అవసరమని మెదక్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ (ఏసిజిఇ) ఆడేపు కరుణాకర్ అన్నారు. మెదక్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళి ఘనపూర్ లో ప్రముఖ బాలసాహితీవేత్త కర్నాటి లింగయ్య రచించిన 'కర్నాటి గేయాలు' బాలగేయ సంపుటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాల సాహిత్యంలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న భానుప్రియ, భవాని, మధుప్రియ, నవదీప్ లకు మంగళవారం అవార్డులు అందజేశారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు కథలు, గేయాలు, పద్యాలు రాయడం సంతోషదాయకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు ఉండ్రాళ్ళ రాజేశం, నల్ల అశోక్, ఎల్లమలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్