సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు అందజేత

525చూసినవారు
సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు అందజేత
నిజాంపేట మండల కేంద్రానికి చెందిన తాడెం కొమురయ్యకు రూ. 60 వేల సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు మంజూరైంది. బుధవారం గ్రామ సర్పంచ్‌ చలిమేటి నరేందర్‌ కొమురయ్య చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా ఆర్థిక భరోసా లభిస్తుందని సర్పంచ్‌ నరేందర్‌ అన్నారు. తనకు రూ. 60 వేల సాయం అందేలా సహకరించిన ఎంపీ రఘునందన్‌రావుకు కొమురయ్య కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ బాబు, బీజేపీ మండల అధ్యక్షుడు సిద్ధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్