రైతుల కష్టాలను పట్టించుకోకుండా, సీఎం రేవంత్ రెడ్డి భూముల అమ్మకాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలపైనే దృష్టి సారించారని ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. బీజేపీ కొనుగోలు కేంద్రాల పర్యటన ప్రకటించగానే ప్రభుత్వం హడావిడిగా లేబర్ ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించిందని ఆయన అన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని, అన్నదాతలు ఆందోళన చెందవద్దని రఘునందన్ రావు భరోసా ఇచ్చారు.