ఆపదలో ఉన్న కుటుంబానికి సీఎంఆర్‌ఎఫ్ ఆర్థిక సాయం అండగా నిలిచింది. నిజాంపేట మండలం నందిగామ గ్రామానికి చెందిన వడ్ల అశ్వినికి మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్‌రావు సహకారంతో రూ. 1. 40 లక్షల సీఎంఆర్‌ఎఫ్ సాయం మంజూరైంది. మంజూరైన చెక్కును శనివారం అశ్విని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపద సమయంలో చొరవ చూపి ఆర్థిక సాయం అందేలా కృషి చేసిన ఎమ్మెల్యేకు అశ్విని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.